NEELONE LABHINCHINDHI JEEVAM SONG LYRICS || #abhishekpraveen | Telugu Christian Song ||




నీలోనే లభించింది జీవం - నీతోనే వరించింది స్నేహం

నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం  

నాకై పెట్టితివి ప్రాణం - నను ఆకర్షించెను నీ త్యాగం  

నీవే నే చేరాల్సిన గమ్యం - ప్రాణానికి ప్రాణం


యేసయ్యా నీకంకితం

నీ మహిమార్థం ఇచ్చిన జీవితం


1. నాకేరూపు లేనప్పుడు - నను నీవే చూసియున్నావుగా ||2||

ఊహే నాకు రానప్పుడు -నీవు నన్నే కోరుకున్నావుగా ||2||

నీకే స్తుతిగీతం - నీకోసం సంగీతం


యేసయ్యా నీకంకితం

నీ మహిమార్థం ఇచ్చిన జీవితం


2. ప్రేమించావు అమితంబుగా - నను నీ రాజ్యాన సమకూర్చగా ||2||

హెచ్చించావు అధికంబుగా - ఘన సంకల్పాన్ని నెరవేర్చగా ||2||

నీవే నా శరణం - నీతోనే నా విజయం


యేసయ్యా నీకంకితం

నీ మహిమార్థం ఇచ్చిన జీవితం


3. నైపుణ్యాన్ని నేర్పించుచు - సరిచేస్తున్నావు క్రమక్రమముగా ||2||

సామర్ధ్యాన్ని అందించుచు - బలమిస్తున్నావు స్థిరపరచగా ||2||

నీతో సహవాసం - అభివృద్ధికి సోపానం


యేసయ్యా నీకంకితం

నీ మహిమార్థం ఇచ్చిన జీవితం


Post a Comment

Previous Post Next Post