.
వర్ణించలేని త్యాగం - ఓదార్పు నొందని వైనం
పాపికై చిందిన రక్తం - సిలువపై విడిచిన ప్రాణం (2)
మనుష్యులందరి కొరకు సిలువ బలియాగం
యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం (2)
పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ..
శుద్దులై జీవించెదము జీవితాంతము
జీవితాంతము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
1. మా పాపములు అపరాధములు నిన్ను నలుగగొట్టినవి-
మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరచినవి (2)
పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చితివి-
మమ్మును క్షమియించుటకు నీ ప్రేమ చూపితివి (2)
జాలి చూపి మా పాపములు క్షమియించుమూ..
కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము
కనికరించుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
2) సర్వోన్నతమైన పరలోకం నుండి మహిమ విడిచి వచ్చావు -
రక్త మాంసాలతో శరీరమును ధరియించి భువిపైన బ్రతికావు (2)
మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పించావు -
మాకు రక్షణిచ్చుటకు రుధిరమును కార్చావు (2)
మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ..
నీ కొరకు మా జీవితము అర్పింతుము
అర్పింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
3) లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను -
తండ్రి చిత్తము సిలువ యజ్ఞము మమ్మును రక్షించెను (2)
శిక్షించబడియు మమ్మును క్షమియించినావు-
దూషింపబడియు మమ్మును ప్రేమించినావు (2)
నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ..
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము
ప్రేమింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)