Adharinchumayya Song Lyrics | ఆదరించుమయ్యా | Suhaas Prince | CalvaryTemple New Song 2024




 ఆదరించుమయ్యా  ఆదుకొనేవాడా 

చేరదీయుమయ్యా  సేదదీర్చేవాడా

యేసయ్య  యేసయ్య  నీ మీదే నా ఆశయ్య



1. రెక్కలే విరిగినా  గువ్వనై నే వొరిగినా

ఎండలో వాడినా  పువ్వునై నే రాలినా 

దిక్కు తోచక నిన్ను చేరితి

కాదనవని నిన్ను నే వేడితి

నను దర్శించుమో యేసయ్య  ||2||

                                               నను ధైర్యపరచుమో నా యేసయ్యా              || ఆదరించుమయ్యా||



2. ఆశలే అడుగంటెనే  నిరాశలే ఆవరించనే  

నీడయే కరువాయెనే  నా గూడుయే చెదరిపోయెనే

నీ తోడు నే కోరుకొంటిని

నీ పిలుపుకై వేచియుంటిని

నీ దరిచేర్చుకో- యేసయ్య  ||2|| 

                                  నన్ను కాదనకుమా నా యేసయ్యా       || ఆదరించుమయ్యా||

Post a Comment

Previous Post Next Post