ఇదే ఆశ నాలో
ఇదే ఆశ నాలో నా యేసయ్య
నీ ప్రేమలోనే జీవించనీ
ఇదే ధ్యాస నాలో నా యేసయ్య
నీ నీడలోనే నేనుండనీ
ఏపాటి నన్ను ప్రేమించినావు
నీలోన నిరతం నను దాచినావు
ఏముంది నాలో కోరావు నన్ను
దీవించి ఇలలో ఘనపరచినావు
ప్రాణమా నా బంధమా నీ ప్రేమ చాలయ్యా
దైవమా నా యేసయ్య నీ తోడు చాలయ్యా
1. గాయాలలోన కన్నీటిలోన ఓదార్పు నీవై చేరావుగా
నిస్సారమైన నా జీవితాన నా కోట నీవై నిలిచావుగా
ఆధార దీపం నీ వాక్యమేగా
నా క్షేమ సౌధం నీ సన్నిధేగా
ఏమివ్వగలను సేవింతు నిన్ను ||ఇదే ఆశ||
2. గాఢాంధకార ఏలోయలైనా నావెంట నీవే ఉన్నావుగా
నీ నీతిమార్గం పరలోక భాగ్యం నాచెంత చేరీ చూపావుగా
లెక్కించలేను నీ మేలులన్నీ
ఊహించలేను నీ ప్రేమ నాకై
ఏమివ్వగలను సేవింతు నిన్ను ||ఇదే ఆశ||
Tags
Christian Telugu Songs lyrics
Idhe Asha Naalo Song Lyrics
Latest Christian Songs 2024
latest new 2024 christian songs lyrics
Telugu Songs Lyrics