రావా యేసుదేవా
రావా యేసుదేవా - నీవే నా వరముగ
దారే చూప రావా - నడిపించే దేవా రావా
ఈ కడలిలో నలిగిన నా హృదయముతో నిను కొలుతును నా ప్రభువా
రావా తోడు రావా - నీవే జీవ నావ
పొంగేటి ప్రేమై రావా - నాతో ఉండిపోవా
1. ఏలో ఏలో - అంటు సాగే - నాదు నావ
మబ్బే కమ్మీ - గాలే రేగే - నీవు లేక
ఆశే నీవు - నాదు ప్రభువ - ఆదుకోవా
దూరమైన - వెల్లువైన - నాతో రావా
కడలిలోన - కరుణ చూపే - దీపం కావా
ఏ బంధమో - అనుబంధమో - బ్రతుకంత నీదేగా - కరుణించ రావయ్యా
2. కొండా కోన - నింగీ నేల - చాలనంత
పొంగీపోయే - ప్రేమే నీది - సంద్రమంత
చూసే నీవు - నాదు బ్రతుకు - భారమంతా
ఆదరించే - అమ్మ వంటి - దైవమే నీవు
దయను చూపే - దరికి చేర్చే - నేస్తమే నీవు
ఏ రాగమో - అనురాగమో - కడదాకా నీవేగా - కృప చూప రావయ్యా
Tags
Christian Telugu Song Lyrics in English
Jeeva Naava Song Lyrics
Latest christian Song Lyrics 2024
Latest Christian Songs 2024
Rava Yesudeva Song Lyrics
Telugu Christian Song 2024
Telugu Songs Lyrics