యేసూ నీవే నను చూచి
యేసూ నీవే నను చూచి - పేరుపెట్టి పిలిచి
నా జీవితము నీ చేతులలో భద్రముగా దాచి
అ.ప.: నను దీవించావే - నా ప్రియ తండ్రివి నీవే
1. నేను ఏర్పడక ముందే నీవు నన్ను ఎరిగియున్నావే
జ్ఞానముతో పెంచావే - ఉన్నతంగ ఉంచావే
తప్పులన్ని క్షమియించుచూ నను చక్కపరచినావే
2. నేను ఏడవక ముందే నీవు నన్ను కలుసుకున్నావే
ఆదరణ ఇచ్చావే - మంచిచేయ నేర్పావే
అడ్డులన్ని తొలగించుచూ నను ముందు నిలిపినావే
3. నేను ఏమనక ముందే నీవు నన్ను పలకరించావే
దీపముగా మార్చావే - కాంతి పంచమన్నావే
చింతలన్ని భరియించుచూ నను ధైర్యపరచినావే
Tags
Christian Telugu Songs lyrics
Latest christian Song Lyrics 2024
Latest christian telugu song 2024
Latest New Telugu Christian song
Telugu Songs Lyrics
YESU NEEVEY NANU CHUCHI SONG LYRICS