నా కెంతో ఆనందం
నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే
1. ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా
2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా
Tags
Christian songs lyrics
Latest Christian Song
Nakentho Anandam Song Lyrics
Telugu christian songs lyrics