Emmanuelu Baludu - New Telugu Christmas Song 2024 | Vagdevi | Akshai Kumar Pammi | Bible Mission TV


ఇమ్మానుయేలు బాలుడు

సొగసైన సౌందర్య పుత్రుడు [2]

మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు

సర్వమానవాళిని రక్షింపను (2)


ఆ బాలుడే యేసు బాలుడు

సర్వలోకానికి ఏకైక రక్షకుడు

ఆ బాలుడే క్రీస్తు బాలుడు

సర్వమానవాళి పాప పరిహారకుడు (2)


1.పరము నుండి దూతలు దిగివచ్చిరి

పాటలు పాడి ఆరాధించిరి (2)

గొల్లలేమో పరుగునోచ్చిరి

క్రీస్తుని చూసి సాగిలపడిరి…(2) ||ఆ బాలుడె ||


2.పాపుల పాలిట రక్షకుడు

రోగుల పాలిట ఘనవైద్యుడు (2)

నిన్ను నన్ను రక్షింపను

భూలోకమున ఉదయించెను (2) || ఆ బాలుడె ||


మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా

నిన్ను నన్ను చేర్చ వచ్చెను (2)

రాజధిరాజుగ లోకాధికారిగా

త్వరలో మేఘాలపై రానైయుండె (2)
రండి రండి రారండి

పండుగ చేయను చేరండి

రండి రండి రారండి

సందడి చేయను చేరండి ||ఇమ్మానుయేలు||

Post a Comment

Previous Post Next Post