కరుణాత్ముడే
కరుణాత్ముడే కదిలొచ్చాడే
అరుణోదయుడై అరుదెంచాడే ||2||
ఆశీర్వాదాలు మొదలాయెనే
చీకటి బ్రతుకులకు వెలుగాయెనే ||2||
పుడమే పులకింపగా - జగమే తరియింపగా
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా ||2||
1. లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడే
ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే ||2||
ఆశ్చర్యమే, తన మహిమను విడిచి వచ్ఛాడే
ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే
బంగారు సాంబ్రాణితో నా స్తుతి గానాలతో
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా ||2||
2. కారణమే ఉంది కారణజన్ముని రాకకు
భూనివాసులందరిని పరమునకు చేర్చుటకు ||2||
ఇంకా సంబరమే, ఊరువాడంతా ఏకమై ఆడాలే
ఆర్భాటమే, చేయి చేయి కలిపి సువార్త చాటాలే
లోకమే ద్వేషించినా, బాధకు గురి చేసినా
నేను పాడెదా - కొనియాడేదా
నేను ఆడేదా - చిందాడేదా ||2||
Tags
christmas songs 2024
christmas songs lyrics
Karunathmude Song Lyrics
Latest New Telugu Christmas songs lyrics
telugu christmas songs lyrics