నీ పక్కనే ఉంటారు
నీ పక్కనే ఉంటారు నిను నిరాశపరిచేవారు
నీ ప్రగతికి ఒకనాడు వారే కారకులౌతారు
భయపడకు వద్దనకు నీ దీవెనలెవరూ ఆపలేరు
అప: మనుషులు చెయ్యాలని చూచిన కీడు
దేవుడు మేలుగ సమకూరుస్తాడు
1 . మంచి అర్పణ ఇచ్చే హేబెలులా నీవుంటే
అసూయతో పగ పెంచుకునే కయీనులు ఉంటారు
వ్యాజ్యెమాడువాడు నీ పక్షమునున్నాడు
పెట్టిన మొరకు చెవియొగ్గి తగిన తీర్పునిస్తాడు
|| నీ పక్కనే ||
2. గొప్ప విశ్వాసియైన అబ్రహాములా నీవుంటే
అత్యాశతో నీ ఆస్తి తీసుకునే లోతులు ఉంటారు
అడుగు పడిన చోటు స్వాస్థ్యంగా ఇస్తాడు
ఇచ్చిన మాట నెరవేర్చి ఫలము అనుగ్రహిస్తాడు
|| నీ పక్కనే ||
3. పవిత్రముగ జీవించే యోసేపులా నీవుంటే
పదే పదే శోధించే పోతీఫరు భార్యలు ఉంటారు
బంధకములనుండి అందలమెక్కిస్తాడు
ఓడిన చోటే నిలబెట్టి గతము మరువజేస్తాడు
|| నీ పక్కనే ||
4 దేవుడే కోరుకున్న దావీదులా నీవుంటే
బలాఢ్యులై నిను బెదిరించే గొల్యాతులు ఉంటారు
చంపచూచువాని నిను ముట్టుకోనీయడు
శత్రువుపైన జయమిచ్చి ఘనత కలుగజేస్తాడు
|| నీ పక్కనే ||