Megham tholgindhi Song Lyrics | 𝑬𝑬 𝑨𝑵𝑨𝑵𝑫𝑨𝑴 𝑵𝑬𝑬 𝑱𝑨𝑵𝑴𝑨𝑻𝑯𝑶 Song Lyrics | 4K Video Song | Bro. Samuel Karmoji | 𝗡𝗘𝗪 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗦𝗢𝗡𝗚 𝟮𝟬𝟮𝟰

 


మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసునా
ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని

మా చీకట్లు తరిమేసే వెలుగేదని అయ్యో

నా బ్రతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్నా చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసే

మనకోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుబంధం తెచ్చేను

నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా ఎవరు విడిచి పోతే

మనకు ఏందిరా ఇమ్మానుయేలు తోడు

మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా అశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు

తండ్రి సమాధాన అధిపతి వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం


1. అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని

తేలిసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని

నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని ప్రతి రేయి పగలు

నిన్ను తలచి సంతసించనీ ఈ ఆనందం

నీ జన్మతో మొదలాయే మొదలాయే
|| చీకట్లు ||


2. కలవరమొందకు కలవరం ఎందుకు కలలన్నీ

కరిగి పోయెనని లోకాలనేలే రాజొకడు మనకొరకు పుట్టాడని

చరిత మార్చునని తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచి పోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచనీ
ఈ ఆనందం తన జన్మతో మొదలాయే మొదలాయే

Post a Comment

Previous Post Next Post