JAYASANKHETAMAA
జయసంకేతమా
జయసంకేతమా - దయా క్షేత్రమా
నన్ను పాలించు నా యేసయ్యా ||2||
అపురూపము నీ ప్రతి తలపు
ఆధరించిన ఆత్మీయ గెలుపు ||2||
నడిపించే నీ ప్రేమ పిలుపు
1.నీ ప్రేమ నాలో ఉదహాయించగా
నా కొరకు సర్వము సమకూర్చేనే ||2||
నన్నెల ప్రేమించ మనసయెను
నీ మనసెంతో మహోన్నతము ||2||
కొంతైనా నీ రుణము తీర్చేదెలా
నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించెద నా యజమానుడా
సేవించెద నా యజమానుడా
2. నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే ||2||
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా ||2||
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా
సీయోను చేర నడిపించుమా
3. నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమీది
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా