TOLAKARI VAANA-తొలకరి వాన
కురిసింది తొలకరి వాన - నా గుండెలోన ||2||
చిరుజల్లాగా ఉపదేశమై - నీ వాక్యమే వర్షమై ||2||
నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయే హెర్మోను మంచువలె ||2||
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన - ఆనందించి ఆరాధించెద నా యేసయ్య ||2||
||కురిసింది తొలకరి వాన||
1.దూలినై పాడైన ఎడారిగా నను చేయక
జీవజలఊటలు ప్రవహింపజేశావు ||2||
కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనియక
సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు ||2||
స్తుతులు స్తోత్రం నీకే అయ్యా దయాసాగరా ||2||
పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య ||2||
||కురిసింది తొలకరి వాన||
2.నీ మందిర గుమ్మములోని బూటలతో శుద్ధి చేసి
నాచీల మండలమునకు సౌందర్యమిచ్చితివి ||2||
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నను నడిపితివి నీ ||2||
తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా ||2||
పొంగి పొలిగి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య ||2||
||కురిసింది తొలకరి వాన||
3.నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
నా ఆశల ఊహలలో విహరింపజేశావు ||2||
నా కడవరి వర్షము నీవైఫలింపజేసావు
నీ మహిమ మేఘములో ననుకొనిపోయెదవు ||2||
హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర ||2||
పొంగి పొలిచి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య ||2||
||కురిసింది తొలకరి వాన||