1.తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే ||2||
తంబుర సితార నాదముతో........
2.రెయి పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమేలు
రెయి పగలు నీ పదసేవే యేసు ప్రభువా చేయుటమేలు
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె
రెయి పగలు నీ పదసేవే ........
పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి ||2||
శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె ||2||
రెయి పగలు నీ పదసేవే .......
3.నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది ||2||
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది ||2||
పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై ||2||
శీఘ్రముగ చేరేదవు ||2||
సీయోనులో నిన్ను కీర్తించెదను
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది ||2||
4.క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం ||2||
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి ||2||
5.దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా ||2||
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా ||2||
6.జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తిమి ||2||
భయములేక పరమ బలమెంది మనము పనిని జేయుదము
జయగీతం పాడి యుద్దము జేసి జయము నొందెదము ||2||
7.ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||2||
శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి ||2||
పరముడ నిన్ను ప్రనుతించెద ప్రియముగా
పరలోక ప్రార్థన నేర్పుమయా
8.అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని ||2||
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను ||2||
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా ||2||
గొప్ప దేవుడవని.. గొప్ప దేవుడవని....
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్ ||2||
9.మంచి కాపరి మనకుండగా భయమేల ఓ సంఘమా
గొప్ప కాపరి మనకుండగా భయమేల ఓ సంఘమా
మంచి కాపరి మనకుండగా భయమేల ఓ సంఘమా
గొప్ప కాపరి మనకుండగా భయమేల ఓ సంఘమా
హల్లెలూయ హాల్లెలూయా ||4||
10.సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే
సర్వశక్తుని నీడను విశ్రమించును
పరమ ధన్యత యిదియే ||2||
తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రెక్కలతో కప్పును ||2||
పగటి బాణమున కైనా
రాత్రి భయమున కైనా ||2||
చీకటిలో తిరుగు తెగులు కైనా
నేనేమీ భయపడను ||2||
తన రెక్కల క్రింద ఆశ్రయము
తన రెక్కలతో కప్పును ||2||
11.ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా......
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా......
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు ||2||
సహియింతువా తీర్పునాడు ||2||
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు ||2||
సహియింతువా తీర్పునాడు ||2||
12.విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ ||2||
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు ||2||
కొనసాగించువాడా యేసు ప్రభూ ||2||
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు ||2||
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ ||2||
13.నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము ||2||
నీ వాక్యమే నా పాదములకు దీపము ||3||
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము ||2||
నీ వాక్యమే నా పాదములకు దీపము ||3||
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా......
14.ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||
మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||
నిత్యమైన మోక్షగృహము నందు చేరి ||2||
భక్తుల గుంపులో హర్షించిన చాలు ||2||
ప్రియ యేసు.....ప్రియ యేసు.......
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||
మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||
15.ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా ||2||
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||2||
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||2||
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా ||2||
16.అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ ||2||
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ ||2||
స్తోత్రము పాడి పొగడెదను ||2||
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను ||4||
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను ||4||
17.ఆ… ఆ… ఆ… ఆ…సదా స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా... స్తు తింతు రక్షకా....
ఆ… ఆ… ఆ… ఆ… నిన్నె స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా... స్తు తింతు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ…సదా స్తుతింతు యేసు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ… నిన్నె స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా నిన్నె స్తుతింతు రక్షకా....నిన్నె స్తుతింతు రక్షకా....||2||
ఆ… ఆ… ఆ… ఆ…సదా స్తుతింతు యేసు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ… నిన్నె స్తుతింతు యేసు రక్షకా
కష్టాల యందు స్తుతింతు – నష్టాల యందు స్తుతింతు ||2||
నిష్ట అదే కదా! స్పష్టమదే కదా! శ్రేష్ట మదేకదా
ఆ… ఆ… ఆ… ఆ…సదా స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా... స్తు తింతు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ… నిన్నె స్తుతింతు యేసు రక్షకా
యేసు రక్షకా... స్తు తింతు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ…సదా స్తుతింతు యేసు రక్షకా
ఆ… ఆ… ఆ… ఆ… నిన్నె స్తుతింతు యేసు రక్షకా