Anuraagaapoornuda Song Lyrics॥ అనురాగపూర్ణుడా ॥ Hosanna Ministries 2024 New Album Song-4 Pas.RAMESH Anna

 




 నీకేగ నా స్తుతిమాలిక - నీకొరకే ఈ ఘనవేదిక 

నీప్రేమనాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుదిరుగలేదు 

మనలేనునే నినుచూడక మహాఘనుడా నాయేసయ్యా!




1. సంతోషగానాల స్తోత్రసంపద - నీకే చెల్లింతును ఎల్లవేళలా

అనురాగశీలుడా - అనుగ్రహపూర్ణుడా  

నీ గుణశీలత వర్ణింపతరమా 

నాప్రేమ ప్రపంచమునీవేనయ్యా 

నీవులేని లోకాన నేనుండలేనయ్యా 

నా ప్రాణం - నా ధ్యానం - నీవేనయ్యా
                           
                                                         || నీకేగ||




2 నీతో సమమైన బలమైన వారెవ్వరు? 

లేరే జగమందు నే ఎందువెదకినను 

నీతి భాస్కరుడా - నీ నీతికిరణం- ఈ లోకమంతా ఏలుచున్నదిగా
 
నా మదిలోన మహారాజు నీవేనయా 

ఇహపరమందు నన్నేలు తేజోమయా 

నీ నామం - కీర్తించి - ఆరాధింతును..
     
                                                     || నీకేగ||




3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు 

వేరే ఆశేమియు లేదు నాకిలలో 

నా ప్రాణప్రియుడా నన్నేలు దైవమా 

ఆపాదమస్తకం నీకేగా అంకితం 

నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్య - నా జీవిత ఆధ్యంతం నీవేనయ్య
 
నీ కొరకే - నేనిలలో - జీవింతును

                                                     || నీకేగ||

Post a Comment

Previous Post Next Post