Sraavyasadhanamu Song Lyrics॥ శ్రావ్యసదనము ॥ Hosanna Ministries 2024 New Album Song-5

 




నీవే శ్రావ్య సదనము - నీదే శాంతి వదనము 

నీ దివసంపద వన్నే చేరగా 

నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా ॥ 2॥ 

నా ప్రతి స్పందనే ఈ ఆరాధన 

నా హృదయార్పణ నీకే యేసయ్య ॥2॥



1.విరజిమ్మే నాపై కృపకిరణం - విరబూసె పరిమళమై కృపకమలం॥ 2॥ 

విశ్వాసయాత్రలో ఒంటరినై - విజయశిఖరము చేరుటకు ॥2॥ 

నీదక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి ॥ 2 ॥ 

నను బలపరచి - నడిపించే నా యేసయ్యా

                             ||నీవే||



2. నీనీతి నీరాజ్యం వెదకితిని 

నిండైన సౌభాగ్యం పొందుటకు 

నలిగివిరిగిన హృదయముతో- నీ వాక్యమును సన్మానించితిని ॥2॥ 

శ్రేయస్కరమైన దీవెనతో - శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు ॥ 2 ॥ 

నను ప్రేమించి - పిలచితివి - నా యేసయ్యా

                              ||నీవే||



3. పరిశుద్ధాత్మకు నిలయముగా 

ఉపదేశమునకు వినయముగా ॥2॥ 

మహిమ సింహాసనము చేరుటకు 

వధువు సంఘముగా మార్చుమయ్య ॥2॥ 

నా పితరులకు ఆశ్రయమై 

కోరినరేవుకు చేర్పించి ॥ 2 ॥ 

నీ వాగ్ధానం -నెరవేర్చితివి - నా యేసయ్యా

                              ||నీవే||

Post a Comment

Previous Post Next Post