ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా....॥2॥
కలవరము నొందను నినునమ్మి యున్నాను
కలత నేను చెందను కన్నీళ్లు విడువను
1. ఆకాశముపై నీ సింహాసనమున్నది- రాజదండముతో నన్నేలుచున్నది
నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా .....
|| ఆకాశము వైపు॥
2. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు
నీ మహిమతో నను నింపి నీ దరికి నన్ను చేర్చి (చేర్చితివి)
నీవుండగ ఈ లోకములో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా....
|| ఆకాశము వైపు ||
3. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చియున్నది
అక్షయ జ్వాలగ నాలో రగులుచున్నది
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపి (నింపితివి)
కృపాసనముగా నను మార్చి నాలో నిరంతరము నివసించితివి....
॥ ఆకాశము వైపు ॥
4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది
భాషలేని మాటలేని స్వరమే వినబడనివి
పగలు బోధించుచున్నదీ రాత్రి జ్ఞానమిచ్చుచున్నది....
॥ ఆకాశము వైపు॥
5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు
మేఘ రథములపై అరుదెంచి నను కొనిపోవా....
ఆశతో వేచియుంటినీ త్వరగా దిగిరమ్మయ్య ....
॥ ఆకాశము వైపు ॥