Bhayamela O Sodara Song Lyrics || A New Telugu Christian Song || Ratna Babu || Sandeep || Dhamni Bhatla || 4k




 భయమేలా ఓ సోదరా _ దిగులేల ఓ సోదరి"2"

ఇశ్రాయేలు దేవుడు తోడుండగా - విడువని దేవుడు మనకు ఉండగా

రక్షించువాడు మనకై తోడుండి నడిపించగా"2"

భయమేలా ఓ సోదరా.......! దిగులేల ఓ సోదరి"2"




1. సింహాల బోనులో పడి ఉన్న దానియేలు

  భయపడక ప్రార్ధించెన్ దేవాతి దేవునికి "2"

  విడిపించి కాపాడేనే - రక్షించి ఘనపరిచేనే"2"

                                     "భయమేల ఓ సోదరా"




2. చెరసాలలో ఉన్న పౌలు  సీలలు

    స్తుతియించి కీర్తించెన్  దేవాతి దేవునికి "2"

   బలపరచి కనపరచనే  నీ మహిమ వివరించునే "2"

                                       "భయమేల ఓ సోదరా"




3. సర్వము కోల్పోయిన పరిశుద్ధుడైన యోబు

     స్తుతియించి ఘనపరిచెన్ దేవాతి  దేవునిని"2"

     తప్పించి కాపాడేనే -- దీవించి ఘనపరిచేనే"2"

                                        "భయమేలా ఓ సోదరా"

Post a Comment

Previous Post Next Post