కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
దేవా రావయ్యా నీ దీవెన లీయవయ్యా
1. ఏదేను వనమున యెహూవా దేవా
మొదటి వివాహము చేసితివి
ఈ శుభదినమున నవదంపతులను ||2||
నీ దీవెనలతో నింపుమయ
||దేవా రావయ్యా||
2. కానా విందులో అక్కరలెరిగి
నీళ్ళను రసముగమార్చితివి
కష్టాలలో నీవు అండగా ఉండి ||2||
కొరతలు దీర్చి నడుపుమయా
||దేవా రావయ్యా||
3. బుద్ధియు జ్ణానము సర్వసంపదలు
గుప్తమైయున్నవి నీ యందే
ఇహపర సుఖములు నిండుగ నొసగి ||2||
నీ దీవెనలతో నింపుమయా
||దేవా రావయ్యా||
Tags
Kalyanam Kamaneeyam Ee Samayam Athi Madhuran Song Lyrics
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం Song Lyrics