Aadharamaa naa yesayya song lyrics || ఆధారమా నా యేసయ్య song lyrics ||

 ఆధారమా నా యేసయ్య



ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన


1. ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే ఓటమైన - ఒంటరైన
కరుణ చూపి - నడిపినావు వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా


2. నీదు వదనం - కాంతి కిరణం
కనులలోని - ప్రేమ మధురం ఎదురు చూసే - జీవ గమనం
బదులు పంపే - సిలువ రుధిరం కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా

Post a Comment

Previous Post Next Post