మహిమ మహిమ ప్రభుకే మహిమ మాకెన్నడు వలదు సుమా
ఈ లోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమ
అహ ఆనందమే పరమానందమే అది మనకు ఆశీర్వాదమే
ఎంత ఔనత్యమునకు ఎదిగినను అంత దీనులమై యుందుము
1. కొండలను పెక్కిలించెడి విశ్వాసం కలిగి జీవించినను
అద్భుతంబగు ఆయన కృప లేనిదే నా విశ్వాసం వ్యర్థమేగా
||అహ ఆనందమే||
2. ఎంత తీవ్రతతో ప్రార్ధించినను సేవకెంత ధనం తెచ్చిన
ఎంత ఆశక్తితో ప్రసంగించినను అణుకువతో ఉందుము
||అహ ఆనందమే||
3. కృపావరములెన్నె కలిగి వున్న ఎన్ని మర్మములెరిగినను
ఎంత మాదుర్యమ పాడగలిగినను వినయము లేనిదే వ్యర్ధము
||అహ ఆనందమే||
4. ఎన్నో ఆధిక్యతలతో కూడిన ఈ గొప్ప సేవను మనకిచ్చెను
తగ్గించుకోందుమా నిలచి యుందుము అంతం వరకూ ఈ గొప్ప సేవలో
||అహ ఆనందమే||
5. కృప చేతనే రక్షింపబడితిమి కృప వలనే అన్నీ పొందితిమి
కృపయందే చలించుచున్నము మనం కృపగల ప్రభుకే మహిమ
||అహ ఆనందమే||