రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను {2}
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాధించేధము మన యేసుని {2}
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
1.గొల్లలు జ్ఞానులు వెల్లి
యేసుని చూసి సంతోషించిరి {2}
మా కోరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుధులరాజు వచ్చినాడని {2}
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే {2}
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
2.పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను {2}
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను {2}
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే {2}
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
Tags
Christmas Song
Raajula Raaju Puttenu song lyrics
Shyam Joseph
Telugu Christian Songs
రాజుల రాజు పుట్టెను song lyrics