E Kshanamuna Nenu Brathikunnanante Telugu Lyrics|| PASTOR AKSHAY || ELI MOSES || Latest Telugu Christian Song 2025

 

ఈ క్షణమున నేను

బ్రతికున్నానంటే




పల్లవి:
ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే

అది కేవలం నీ కృపయేనయ్యా..2
ప్రతిక్షణము నా వెన్నంటి నాడిచినవు

కంటిపాపలా నన్ను కాచినవు..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా

నీకే స్తోత్రమయ్యా..2
|| ఈ క్షణమున ||



1. నిరాశలో ఉన్నపుడు ఆశగా చిగురించావు

శోధనలో ఉన్నపుడు వేదన తొలగించావు..2
నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా నిను గాక దేనిని నే కొరలేనయ్యా.
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా

నీకే స్తోత్రమయ్యా..2
|| ఈ క్షణమున ||


2. కలవరమందు ఉన్నపుడు కలతను తొలగించావు

- ఒంటరినై ఉన్నపుడు నా సమూహామైనావు..2
నీవంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా -

నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా..2
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా

నీకే స్తోత్రమయ్యా..2

|| ఈ క్షణమున ||

3. పాపమునందు ఉన్నపుడు నాకై బలియైనావు

- శాపమునంతా తొలగించి పరిశుద్ధత నిచ్చావు..2
నీదు బలియగామే నన్ను బ్రతికించినది

- నీ సిలువ యాగమే నను రక్షించినది..2
బ్రతుకంతా నీ కొరకై ఇల జీవింతున్నయ్యా..2
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా

నీకే స్తోత్రమయ్యా..2

|| ఈ క్షణమున ||

Post a Comment

Previous Post Next Post