అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (2)
1. మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
2. లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా (2)
3. బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||
4. పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు అక్క
Tags
Ammalara O Akkalaara Song Lyrics
Christian Telugu Songs lyrics
sailanna songs
telugu new songs
అమ్మలారా ఓ.. అక్కలారా Song Lyrics