Pailemu kodaka papam cheyyakura Song Lyrics || పైలం కొడుకా పాపం చేయకురాSong Lyrics||




 పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా




1. ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది

పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది

పాపమన్నది పాములాంటిది

పగ పడ్తది ప్రాణం తీస్తది           ||పైలం||




2. మనిషి జీవితం విలువయ్యింది

మరువకు కొడుకా మరణమున్నదని

బ్రతికింది ఇది బ్రతుకు కాదురా

సచ్చినంక అసలాట ఉంటది          ||పైలం||




3. కత్తి కన్న పదునెక్కువ కొడుకా

మనిషి కోపము మంచిది కాదు

కాలు జారితే తీసుకోవచ్చురా

నోరు జారితే తీసుకోలేము          ||పైలం||




4. క్రైస్తవ జీవితం విలువయ్యింది

నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా

నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా

నిందలన్ని మొయ్యాలిరా కొడుకా          ||పైలం||




5. విచ్చలవిడిగా తిరుగుతున్నావు

ఎవరు చూడరని ఎగురుతున్నావు

చూసే దేవుడేసయ్య ఉన్నడు

తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా          ||పైలం||




6. గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు

పొగాకు తినకురా పోతవు నరకం

సినిమా చూడకు చింతలు తప్పవు

ఫోజులు కొట్టకు పోతవు నరకం          ||పైలం||




7. కుమ్మరి పురుగు గుణం చూడరా

బురదల ఉంటది బురదే అంటదు

తామెర పువ్వు బురుదల ఉంటది

వరదొస్తే తల వంచుకుంటది          ||పైలం||




8. ఎన్నో ఆశలు పెట్టుకున్నరా

సేవ చేస్తే నిను చూడాలని

నా కలలను కల్ల చెయ్యకు కొడుకా

కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా          ||పైలం||




9. పొందుకున్నవు రక్షణ నీవు

పోగొట్టుకోకు పోతవు నరకం

నరకమంటే ఆషామాషీ కాదురో

అగ్ని ఆరదు పురుగు చావదు          ||పైలం||




10. ప్రపంచమంతటా పాపమున్నది

మందులేని మాయ రోగమున్నది

నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా

నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా        




11. నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు

యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు

నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా

నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా          ||పైలం||

Post a Comment

Previous Post Next Post