అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
తనసమృద్ధితో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన - పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న - నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా