Manava O Manava Song Lyrics || మానవా ఓ మానవా Song Lyrics || Nagaraju | Suresh | 4K | Latest Christian song 2024 మానవా... ఓ.. మానవా.. 

నువు చేసే పాపములు మానవా.. !  ||2||

నీకై నాకై మరణించెను యేసు..

 మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు.. ||2||

తెలుసురా.. నీకంత తెలుసురా..

అయినా కాని నీవు మారవురా.. ||2|| 

      


1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. 

సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ... ||2||

కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..

  మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు.... ||2||

తెలుసురా.. నీకంత తెలుసురా..

అయినా కాని నీవు మారవురా.. ||2||

                                  ||మానవా... ఓ.. మానవా..|| 2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...

   ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...||2||

నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... 

ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...||2||

తెలుసురా.. నీకంత తెలుసురా..

అయినా కాని నీవు మారవురా.. ||2||

                                  ||మానవా... ఓ.. మానవా..||3) మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు- 

ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. ||2||

కొన్ని దినములేరా నీకు సమయమున్నది...

  ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..||2||

తెలుసురా.. నీకంత తెలుసురా

అయినా కాని నీవు మారవురా ||2||

                                  ||మానవా... ఓ.. మానవా.. ||Post a Comment

Previous Post Next Post