వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ
ఆ మారు మనసు లేని పిల్లతో పెళ్లి నాకు
చేయొద్దే మాయమ్మ నాకొద్ధే మాయమ్మ
1. పూటకో సోకు చేస్తాను అంటది
రోజుకో పిక్నిక్ వెళ్దాము అంటది (2)
చీమ జోకుల తోటి చిత్తుగా తింటది
2. ఇదివరకే నేను పాపములున్నోన్ని
ప్రభుని నమ్ముకుని పాప మొదులుకున్న (2)
ఆస్తిపాస్తి వదులుకున్న నాకాయనే దిక్కని బ్రతుకుతున్న (2)
3. మామ బిడ్డ యని మస్క కొట్టకు నన్ను
కట్నం ఇస్తుండ్రని కాళ్లు పట్టుకోకు (2)
కట్నాలు తెస్తది కయ్యాలు తీస్తది
కట్నాల పైసలు పుట్నాలకైతయి
4. మామ అత్త మీద మరిగే నీళ్లు పోసి (2)
ఉత్త మాటలు చెప్పి ఊరంతా పిలుస్తది
పదిమందిలో నా పరువంతా తీస్తది (2)
5. శుక్రవారం సుప్రభాతం పెడతది
శనివారం శక్తులకు మొక్కుతది (2)
గుడి సుట్టూ తిప్పుతది గుండు కొట్టిస్తది (2)
తీర్థయాత్రలని తిప్పలు పెడతది (2)
6. చాలీచాలని చీరలు కడతది
అర్థ బెత్తెడు దుస్తులు యేస్తది (2)
మూతికి రంగేసి ముప్పు తిప్పలు పెట్టి (2)
కోతోల గంతేసి కొంపంటు పెడతది (2)
7. మంచి బుద్ధులు ఉండి మారుమనసు పొంది (2)
కుంటి పిల్లను సరే కుస్తోటి చేసుకుంటా (2)
ప్రభు ఆనంద యాత్రలో ఆడుతూ పాడుతూ ఆనందముగ సాగిపోతా (2)
లేదే మాయమ్మ లేదే మాయమ్మ
చీకటికి వెలుతురికి పొత్తు లేదే మాయమ్మ
నాకొద్దే మాయమ్మ (3)